Ram Charan : రామ్చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో చర్చ.. వీడియో వైరల్..
'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ నటన గురించి పాకిస్తాన్ మీడియాలో చర్చ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
- gum 95921
- Published on- March 8, 2024 / 09:14 AM IST
Pakistan media discuss about Ram Charan acting in RRR Movie
Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ పేరు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మోతమోగిపోతుంది. ఆ సినిమాలో రామరాజు పాత్రలో పలు వేరియేషన్స్ చూపించి టాలీవుడ్ టు హాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ లో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ మేకర్స్ సైతం ఈ పాత్ర ఇంట్రడక్షన్ సీన్ కి గూస్బంప్స్ ఫీల్ అయ్యారు.
వేలమంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ విజుల్స్ వేయించింది. తాజాగా ఈ యాక్షన్ సీన్ గురించి, రామ్ చరణ్ ఇంటెన్స్ యాక్టింగ్ గురించి పాకిస్తాన్ మీడియాలో మాట్లాకోవడం విశేషం. పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో.. ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
“రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ వేలమంది మధ్యలోకి దూకి ఫైట్ చేసి, మళ్ళీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడడం మైండ్ బ్లోయింగ్ అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Premalu Review : ‘ప్రేమలు’ మూవీ రివ్యూ.. సింగిల్ బాయ్స్ కచ్చితంగా చూడాల్సిందే..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. మన శత్రు దేశమైన పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవడం అంటే మాములు విషయం కాదంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఈ పాత్రతో చూపించిన ఇంపాక్ట్.. ఇలా చర్చించుకోవడంతో ఆగిపోలేదు. ఇటీవల ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ లోని ఒక పాత్ర కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ప్రకటన ఇవ్వడం గమనార్హం.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ నెల మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది. అయితే ఈ అప్డేట్ గతంలోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన ‘జరగండి జరగండి..’ సాంగ్ అప్డేట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మూవీ టీం ఏం ప్లాన్ చేసిందో చూడాలి.
