ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సినిమాల రూపంలో పోటీ క్రియేట్ అయ్యింది. పవన్‌ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ‘పవర్‌స్టార్’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల చేసి వివాదం మరింత ముదిరేలా చేశాడు వర్మ. ‘పవర్‌స్టార్’ ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే పవన్ అభిమానులు నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్‌కు సపోర్ట్‌గా రూపొందుతోన్న ‘పరాన్నజీవి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో రామ్ గోపాల్ వర్మ పాత్రలో కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్నాడు.