Praveen : సన్నాఫ్ సత్యమూర్తి సీన్ రిపీట్.. నాన్న చనిపోయాక చెడ్డపేరు రావొద్దని.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్..
తాజాగా ప్రవీణ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. (Praveen)
- Saketh U
- Published on- May 16, 2026 / 10:46 PM IST
Praveen
Praveen : పటాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న ప్రవీణ్ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలతో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే వంశిత అనే నటి, డ్యాన్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా ప్రవీణ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ప్రవీణ్ తండ్రి 2022 లో మరణించారు.
Also Read : Ram Charan : తప్పు తనదే అని రామ్ చరణ్ చెప్పారు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. ఫైట్ మాస్టర్ వివరణ..
పటాస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. మా నాన్న కొన్ని షూరిటీ సంతకాలు పెట్టడంతో ఆ డబ్బులు మేము కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్న పేరు బ్యాడ్ అవ్వకూడదు అని నేను దాచుకున్న డబ్బులు అన్ని వాటికి కట్టేసాను. అలా ఫైనాన్షియల్ గా ఒకటి రెండు దెబ్బలు పడ్డాయి. నేను ఆయన చేసింది కదా అని డబ్బులు ఇవ్వకపోతే, జనాల డబ్బులు ఎగ్గొట్టి నేను ఇల్లు, కార్ కొనుకున్నా అంటారు. అందుకే ఆయనకు చెడ్డపేరు రాకూడదు అని మొత్తం తీర్చేసా.
ఆయన సపోర్ట్ వల్లే నేను ఇక్కడే ఉన్నా. టెన్త్ అవ్వగానే ఇండస్ట్రీకి వచ్చా. మా నాన్న సపోర్ట్ చేశారు. నా 9వ తరగతిలోనే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయేటప్పుడే మా అందర్నీ దగ్గరకు తీసుకొని మా నాన్నకు ఇంకో పెళ్లి చేసుకోవద్దు, నా పిల్లల్ని చూసుకో, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పి చనిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చాక భయపడితే ఆయనే చాలా ధైర్యం ఇచ్చారు అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Pavithra Puri : ఏనుగులతో సరదాగా పూరి జగన్నాధ్ కూతురు.. పవిత్ర పూరి క్యూట్ ఫొటోలు..
