Making Glimpse : పవన్ – రానా.. ఎవరూ తగ్గట్లేదుగా..
వచ్చే సంక్రాంతికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ గా బాక్సాఫీస్ రిపోర్టింగ్ ఇవ్వబోతున్నారు..
- sekhar
- Published On : July 27, 2021 / 04:54 PM IST
Pawan
Making Glimpse: వచ్చే సంక్రాంతికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ గా బాక్సాఫీస్ రిపోర్టింగ్ ఇవ్వబోతున్నారు.. పవన్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులో క్రేజీ రీమేక్‌గా వార్తల్లో నిలుస్తుంది. ఈ మూవీని పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్.కె.చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.
Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్..
ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుగుతోంది. సోమవారం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోలీస్ క్యారెక్టర్ ‘భీమ్లా నాయక్’ గా రివీల్ చేసిన టీం.. మంగళవారం మేకింగ్ గ్లింప్స్ వదిలారు. పోలీస్ గెటప్‌లో పవర్‌స్టార్ లుక్ అదిరిపోయింది. రానా కూడా సరికొత్త మేకోవర్‌లో కనిపించారు. 2022 సంక్రాంతికి సినిమా రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడీ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే- డైలాగ్స్ రాస్తున్నారు. ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్.
