Pawan Kalyan : పవన్-సుజిత్ సినిమా ముహూర్తం ఆ రోజేనా?? ఓపెనింగ్స్ అవుతున్నా షూట్స్ కి వెళ్లని పవన్ సినిమాలు..

ఇప్పుడు సుజిత్ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. జనవరి 30న పవన్ - సుజిత్ కాంబోలో దానయ్య నిర్మాణంలో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఒకవేళ పూజా కార్యక్రమాలు నిర్వహించినా.............

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. పవన్ రాజకీయాల వల్ల సినిమా షూట్స్ కి సరిగ్గా డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా షూట్ జరుగుతుంది. పవన్ ఖాళీ ఉన్నప్పుడు ఇచ్చిన డేట్స్ లో ఈ సినిమా షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది. ఎలాగైనా ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల అది అయ్యేలా కనిపించట్లేదు.

ఓ పక్క ఎప్పుడో ఓకే చేసిన ఈ సినిమానే సాగట్లేదు అంటే వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు పవన్. హరిహర వీరమల్లు సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, ఆ తర్వాత సుజిత్, సురేంద్రరెడ్డి, సముద్రఖని దర్శకత్వంలో వరుసగా సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలు ఎప్పటికి మొదలవుతాయో తెలీదు. హరిహర వీరమల్లు షూట్ అవ్వకుండానే ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ షూట్ మాత్రం మొదలవ్వలేదు.

Pathaan : ఆ రెండు రికార్డులని మాత్రం పఠాన్ కొట్టలేకపోయింది.. బాహుబలి, RRR తర్వాతే పఠాన్..

ఇప్పుడు సుజిత్ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. జనవరి 30న పవన్ – సుజిత్ కాంబోలో దానయ్య నిర్మాణంలో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఒకవేళ పూజా కార్యక్రమాలు నిర్వహించినా షూట్ మాత్రం మొదలవ్వదు అని క్లారిటీగా తెలుస్తుంది. ఒకపక్క హరిహర వీరమల్లు షూట్ ఇంకా పూర్తి కాలేదు, మరో పక్క ఇంకో సంవత్సరంలో ఏపీలో ఎలక్షన్ ఫీవర్ రాబోతుంది. ఇలాంటి టైంలో పవన్ షూట్స్ కి డేట్స్ ఇవ్వలేడు. మరోపక్క సుజిత్ కంటే ముందు హరీష్ శంకర్ సినిమా ఉంది. ఇన్నిటి మధ్యలో అసలు సుజిత్ సినిమా షూట్ మొదలవ్వదు అలాంటప్పుడు ఇప్పుడే పూజాకార్యక్రమాలు ఎందుకు అంటున్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు నిర్వహించిన సినిమానే ఇంకా మొదలవ్వలేదు కదా అని అనుకుంటున్నారు. కానీ పవన్ అభిమానులు మాత్రం వరుసగా సినిమాలు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.

ట్రెండింగ్ వార్తలు