Pathaan : ఆ రెండు రికార్డులని మాత్రం పఠాన్ కొట్టలేకపోయింది.. బాహుబలి, RRR తర్వాతే పఠాన్..

ఇప్పటికే పలు రికార్డులు సృస్తిస్తున్న పఠాన్ సినిమా ఓ రెండు రికార్డులని మాత్రం దాటలేకపోయింది. ఆ రెండు రికార్డులు కూడా మన బాహుబలి, RRR సినిమాల మీదే ఉండటం గమనార్హం................

Pathaan : ఆ రెండు రికార్డులని మాత్రం పఠాన్ కొట్టలేకపోయింది.. బాహుబలి, RRR తర్వాతే పఠాన్..

pathaan doesn't break those 2 records on the name of bahubali 2 and RRR

Pathaan :  షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ లో సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా పఠాన్. షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల జనవరి 25న పఠాన్ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజయింది.

ఫుల్ యాక్షన్ సినిమా కావడం, షారుఖ్ చాలా రోజుల తర్వాత తెరపై కనపడటంతో మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ సెట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజయిన మూడు రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి మరింత ముందుకి దూసుకుపోతుంది. కింగ్ ఈజ్ బ్యాక్, బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు అందరూ. ఇప్పటికే పలు రికార్డులు సృస్తిస్తున్న పఠాన్ సినిమా ఓ రెండు రికార్డులని మాత్రం దాటలేకపోయింది. ఆ రెండు రికార్డులు కూడా మన బాహుబలి, RRR సినిమాల మీదే ఉండటం గమనార్హం.

రిలీజ్ మొదటి రోజు అత్యధికంగా టికెట్లు అమ్ముడైన హిందీ భాష సినిమాల్లో బాహుబలి మొదటి ప్లేస్ లో ఉంది. బాహుబలి 2 డబ్బింగ్ హిందీ వర్షన్ సినిమాకి మొదటి రోజు 6 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ గా ఉంది. పఠాన్ సినిమాకి ఉన్న క్రేజ్ చూసి ఈ రికార్డుని దాటేస్తుంది అనుకున్నారు అంతా. కానీ పఠాన్ సినిమా మొదటి రోజు మొత్తం 5 లక్షల 56 వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయి రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రికార్డు ఇంకా మన బాహుబలి సినిమాకే ఉంది. బాహుబలి మొదటి స్థానంలో ఉండగా పఠాన్ సినిమా రెండో స్థానంలో ఉండగా KGF 2, వార్ సినిమాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.

Senior Heros : ఫామ్ లోకి వచ్చిన సీనియర్ స్టార్ హీరోలు.. మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతారా??

ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల్లో కూడా పఠాన్ సినిమా రికార్డు సెట్ చేయలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మొదటి రోజు 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో RRR సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, KGF 2, సాహో, రోబో 2 సినిమాలు ఉన్నాయి. పఠాన్ సినిమా ఐదో స్థానంలో ఉండటం విశేషం. పఠాన్ సినిమా మొదటి రోజు కేవలం 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఈ రికార్డుని కూడా బద్దలుకొట్టలేకపోయింది పఠాన్. ఈ రెండు రికార్డులు కూడా మన బాహుబలి 2, RRR సినిమాలకే ఉండటం మరో విశేషం.