×
Ad

Pawan Kalyan: అబ్బా.. ఇది కదా అసలైన ట్విస్టు.. సురేందర్ రెడ్డికి అసలైన పరీక్ష మొదలయ్యింది!

పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సురేందర్ రెడ్డి మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

pawan kalyan and surender reddy movie update

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సాగె గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రానుంది అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయ్.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక పవర్ ఫుల్ కథను ఫిక్స్ చేశాడట సురేందర్ రెడ్డి. అదే కథను పవన్ కళ్యాణ్ కు వినిపించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కానీ, చిన్న చిన్న మార్పులు, ఫైనల్ న్యారేషన్ మిగిలుందని టాక్. ఇందులో భాగంగానే చాలా కాలంగా స్క్రిప్ట్ పైనే కుర్చున్నారట సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ. ఈ ఇద్దరికీ అసలు కథ ఇప్పడే మొదలయ్యింది.

Ntr: రికార్డ్స్ అలర్ట్.. డ్రాగన్ టీజర్ వచ్చేస్తోంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ

ఎందుకంటే, ఫైనల్ న్యారేషన్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) శాటిస్ఫై అయితేనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడానికి ఒకే అన్నాడట. అందుకే, ఈసారి కథను పక్కాగా సెట్ చేయడం కోసం తలములకలవుతున్నారట సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యేవరకు డేట్స్ ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగా ఉందట సిచువేషన్. దానికి కారణం, పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాలే. ఆయన, ఒకసారి డేట్స్ లాక్ చేశారంటే మళ్ళీ డేట్స్ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. మళ్ళీ డేట్స్ అలాట్ చేయడం అంటే కుదరదు. కాబట్టి, కథ పక్కాగ సెట్ చేశాకనే డేట్స్ ఇవ్వడానికి అంగీకరించాడట పవన్ కళ్యాణ్.

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మంగళగిరిలో పవన్ కళ్యణ్ కార్యాలయం పక్క వేసిన భారీ సెట్ లో జరుగనుందట. ఒకప్ప రాజకీయ పనులు, మరోపక్క షూటింగ్ పనులు చేసుకోవడానికి వీలుగా ఆయన ఆఫీస్ పక్కనే పెద్ద సెట్ వేశారని సమాచారం. కాబట్టి, సురేందర్ రెడ్డికి ఫైనల్ ట్విస్ట్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అలా సురేందర్ రెడ్డికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలయ్యిందని టాక్ నదిస్తోంది.