Bro Movie : పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ కమింగ్..

పవన్ అండ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరగబోతుంది. ఇక ఈ ఈవెంట్ కి పవన్ వస్తాడా? లేదా? అని ఒక సందేహం నెలకుంది. తాజాగా దీని పై..

  • Published On : July 24, 2023 / 01:46 PM IST

Pawan Kalyan attending Sai Dharam Tej Bro Movie Pre Release event

Bro Movie : ఈ వారం టాలీవుడ్ ఆడియన్స్ ముందకు వచ్చేందుకు సిద్దమవుతున్న మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాతో అలరించబోతుంది. ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో వింటేజ్ మార్క్ పవన్ కళ్యాణ్ కనిపించడంతో మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులంతా.

Suriya : తెలుగు స్టార్ హీరో రేంజ్‌లో సూర్య బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆంధ్రాలో 1500 పైగా బైక్స్‌తో ర్యాలీ.. వీడియో వైరల్!

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్న చిత్ర యూనిట్.. ఈ నెల 25న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ కాంపెయిన్ లో పవన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా? లేదా? అని ఒక సందేహం నెలకుంది. తాజాగా దీని పై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చేశాడు. సోషల్ మీడియా మీమర్స్ తో ఇంటరాక్ట్ అయిన తేజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ వస్తున్నాడు అంటూ కన్‌ఫార్మ్ చేశాడు.

Suriya : బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మరణించిన అభిమానుల కుటుంబాలను పరామర్శించిన సూర్య.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ థాంక్యూ!

కాగా ఈ సినిమా తమిళ్ మూవీ ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా వస్తుంది. తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటిస్తుంటే ప్రియా ప్రకాష్ వారియర్ తేజ్ కి చెల్లి పాత్రలో కనిపించబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 28న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సినిమాని లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేయడంతో టికెట్ రేట్లు ఏమి పెంచడం లేదని నిర్మాత తెలియజేశాడు.