Bheemla Nayak Fans Reaction : థమన్ అన్నా.. ఏం తాగి కొట్టావన్నా మ్యూజిక్..!
థమన్ ట్యూన్ కంపోజ్ చేసిన ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సాంగ్‌లో.. హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పవన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..
- sekhar
- Updated on- September 2, 2021 / 01:53 PM IST
Bheemla Nayak Song
Bheemla Nayak Fans Reaction: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్‌డేట్స్‌తో సర్‌ప్రైజ్ చెయ్యనున్నారు. ముందుగా పవన్ పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో కనిపించనున్న ‘భీమ్లా నాయక్’ తో సందడి షురూ చేశారు.
Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..
పవన్, రానా దగ్గుబాటిల క్రేజీ కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను.. ‘భీమ్లా నాయక్’ పేరుతో.. సాగర్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. పవన్ భార్యగా నిత్యా మీనన్, రానా పక్కన ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు.
Pawan Kalyan : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. అప్పుడు 5 వేలు.. ఇప్పుడు 50 కోట్లు..
సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అదిరిపోయాయి. థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ కలిసి సాలిడ్ ఎనర్జీతో అద్భుతంగా పాడారు. రిలీజ్ చేసిన కొద్దిసేపటికే హైయ్యెస్ట్ వ్యూస్, లైక్స్‌తో సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోందీ సాంగ్..
Bheemla Nayak Title Song : ‘భీం భీం భీం భీం భీమ్లానాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’..
‘‘భీం భీం భీం భీం భీమ్లానాయక్.. బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్.. భీం భీం భీం భీం భీమ్లానాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్.. ఆ జుట్టునట్టా సవరించినాడో.. సింగాలు జూలు విదిలించినట్టే.. ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే.. ఆ కాలి బూట్లు బిగబట్టినాడో.. తొడగొట్టి వేట మొదలెట్టినట్టే’’.. అంటూ సాగే ఈ పవర్‌ఫుల్ సాంగ్.. పవర్‌స్టార్ ఫ్యాన్స్, ఆడియెన్స్ ముఖ్యంగా మాస్ జనాలకు విపరీతంగా ఎక్కేసింది. ‘థమన్ అన్నా ఏం తాగి కొట్టావన్నా మ్యూజిక్’.. ‘ఊచకోత కోసావ్ కదన్నా సాంగ్‌ని’ అని కామెంట్స్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ నెట్టింట ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
