Pawan Kalyan : తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాత్రంతా హాస్పిటల్‌లోనే ఉండి.. తేజ్ – పవన్ మధ్య బాండింగ్
తేజ్ యాక్సిడెంట్ అయినప్పుడు తన పరిస్థితి, హాస్పిటల్ కి వెళ్తే అక్కడి పరిస్థితి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి మాట్లాడారు కార్తీక్ వర్మ.
- Saketh U
- Published On : June 12, 2023 / 07:35 AM IST
Pawan Kalyan crying Sai Dharam tej accident day at hospital
Sai Dharam Tej : ఇటీవల విరూపాక్ష(Virupaksha) సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ కార్తీక్ వర్మ(Director Karthik Varma). సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కి మంచి కంబ్యాక్ సినిమా ఇవ్వడమే కాక ప్రేక్షకులకు అదిరిపోయే సినిమాను ఇచ్చి నిర్మాతలకు కూడా 100 కోట్ల సినిమాను ఇచ్చారు కార్తీక్. తాజాగా కార్తీక్ ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన గురించి, తేజ్ గురించి, సుకుమార్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో తేజ్ యాక్సిడెంట్ అయినప్పుడు తన పరిస్థితి, హాస్పిటల్ కి వెళ్తే అక్కడి పరిస్థితి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి మాట్లాడారు. కార్తీక్ వర్మ మాట్లాడుతూ.. ఇంకో నాలుగు రోజుల్లో విరూపాక్ష షూట్. నైట్ ఆఫీస్ లో కూర్చొని ఫోన్స్ పక్కన పెట్టేసి పని చేసుకుంటుంటే మా ఆఫీస్ బాయ్ వచ్చి న్యూస్ చూడమని చెప్పాడు. న్యూస్ లో తేజ్ యాక్సిడెంట్ చూసి నేను షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్ధం కాలేదు. కిందకి వచ్చి ఆ షాక్ లో నడుచుకుంటూనే హాస్పిటల్ కి వెళ్ళాను అన్నారు.
అక్కడ హాస్పిటల్ దగ్గర.. జనం, మీడియా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారైతే నా మేనల్లుడు కళ్ళు తెరిచేవరకు నేను హాస్పిటల్ నుంచి కదలను అని అక్కడే కూర్చున్నారు. పవన్ గారు కూడా ఏడ్చారు. తర్వాత డాక్టర్ వచ్చి పరిస్థితి చెప్పాక, కోలుకోవడానికి టైం పట్టుద్ది అని చెప్తే రాత్రి నుండి తెల్లారి 6 వరకు హాస్పిటల్ లో అలాగే కూర్చొని వెళ్లారు అని తెలిపారు కార్తీక్.
దీంతో మరోసారి తేజ్ – పవన్ బాండింగ్ వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ మధ్య మంచి బాండింగ్ ఉందని అందరికి తెలిసిందే. తేజ్ ఎన్నో సార్లు పవన్ మామయ్య గురించి ఆయనే నా గురువు అని చెప్పాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా వీరి ఫోటోలు చూస్తే వీరిద్దరికి ఎంత మంచి బాండింగ్ ఉందో అర్థమైపోతుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి బ్రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
