×
Ad

పెద్దన్నయ్య పెద్ద మనసు.. నా అన్న బిడ్డ రామ్ చరణ్.. టాలీవుడ్ ప్రముఖులకు పవన్ ప్రశంసలు..

కరోనా ఎఫెక్ట్ : విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులను ప్రశంసించిన పవన్ కళ్యాణ్..

  • Published On : March 27, 2020 / 02:36 PM IST

కరోనా ఎఫెక్ట్ : విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులను ప్రశంసించిన పవన్ కళ్యాణ్..

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి విషయంలోనూ ప్రజలకు, ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరూ ముందుకు రావడం అభినందనీయం.

ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు ప్రకటిస్తూ.. ప్రభుత్వాలకు అండగా ఉండటమే కాకుండా, ప్రజలను కూడా ఇంటి పట్టునే ఉండి సురక్షితంగా ఉండమని దాతలు సలహాలు ఇస్తున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ దాతృత్వానికి సోషల్ మీడియా ద్వారా జేజేలు పలికారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు, ప్రధానమంత్రి సహాయనిధికి రూ. కోటి ప్రకటించిన పవన్.. తనలాగే ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ‘పెద్దన్నయ్య పెద్దమనసు’ అంటూ అన్నయ్య చిరంజీవితో మొదలుపెట్టి ప్రభాస్, తారక్, మహేష్, నితిన్, కొరటాల, త్రివిక్రమ్ వరకు విరాళాలు ప్రకటించిన వారికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.