Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ రివ్యూ.. తొలిప్రేమ సాంగ్ రీమిక్స్.. ఇండస్ట్రీ జనాలు ఏమంటున్నారు..?
టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాని చూసారు. (Ustaad Bhagat Singh)
- Saketh U
- Published On : March 18, 2026 / 02:30 PM IST
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భారీగా తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మొదట్లో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ కి కూడా పెద్దగా ఆశలు లేవు కాని ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా సినిమాపై హైప్ వచ్చింది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ రావడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై జోష్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాని చూసారు. దీంతో ఈ సినిమా టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.
Also Read : Thaman: DSP గౌరవం కోసం వెనక్కి తగ్గిన తమన్.. మా తమన్ అన్న బంగారం అంటూ కామెంట్స్
Ustaad Bhagat Singh
టాలీవుడ్ సమాచారం ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రన్ టైం రెండు గంటల 34 నిముషాలు. సెన్సార్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. హరీష్ శంకర్ రాసిన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ ని పవన్ అదే రేంజ్ లో చెప్పారట. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఎంట్రీ సీన్ తోనే ఒక ఫైట్ పెట్టారట. ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్స్, సెకండ్ హాఫ్ లో రెండు ఫైట్స్ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మాస్ లుక్స్ లో అదరగొడుతూ వన్ మ్యాన్ షోగా సినిమా అంతా నడిపించారని చెప్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజయిన దేఖ్ లేంగే సాలా సాంగ్ లో పవన్ స్టెప్పులు చూసాము. సినిమాలో ఆ సాంగ్, స్టెప్పులు అదిరిపోతాయి. ఆ డ్యాన్స్ కోసం పవన్ బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. కానీ మిగతా పాటలేవి అంతగా ఇంప్రెస్ చేయలేదట. పాటలు అన్ని ఒక్కసారి వినడమే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ గట్టిగానే ఇచ్చాడట.
ఈ సినిమాలో మరో హైలెట్ పవన్ కామెడీ. చాన్నాళ్ల తర్వాత పవన్ మార్క్ కామెడీని హరీష్ ఈ సినిమాలో చూపించాడట. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో తొలిప్రేమ సినిమాలోని ఓ సాంగ్ ని రీమిక్స్ చేసినట్టు సమాచారం. ఆ సాంగ్ మాత్రం హైలెట్ కానుందట. శ్రీలీల, పవన్ మధ్య డ్యూయెట్ సాంగ్ లా ఆ పాటను వాడారట. అలాగే సెకండ్ హాఫ్ లో చైల్డ్ ఎమోషన్ కూడా ఉందట. కథ పరంగా సింపుల్ అనిపించినా ఎంటెర్టైనమెంట్, మాస్ అంశాలతో కమర్షియల్ సినిమాగా పవన్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉస్తాద్ ని తెరకెక్కించారని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఫ్యాన్స్ ని అయితే ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుంది.
Also See : Manchu Lakhsmi Daughter : మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక.. ఫొటోలు..
ఈ సినిమాకు ప్రీమియర్స్ మాత్రం లేవు. అమెరికాలో నేడు రాత్రికే షోలు పడుతుండగా ఏపీలో మాత్రం రేపు ఉదయం నాలుగు గంటల నుంచే బెనిఫిట్ షోలు పడనున్నాయి. తెలంగాణలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి షోలు పడతాయని సమాచారం. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.
