OG Movie: ఓజి కోసం సుజిత్ మాస్టర్ ప్లాన్.. మూడు వేరియేషన్స్‌లో పవన్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీలో ఆయన్ను మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో చూపెట్టేందుకు దర్శకుడు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు.

Pawan Kalyan In Three Variations In OG Movie

OG Movie: డైరెక్టర్ సుజిత్ తన నెక్ట్స్ మూవీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాలో పవన్‌ను సుజిత్ ఎలా చూపిస్తాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ‘OG’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది.

OG Movie: ఓజి నెక్ట్స్ స్టాప్ ఎక్కడో తెలుసా.. మనోళ్లకి పండగే!

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే విషయంపై చిత్ర వర్గాల్లో తాజాగా ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడని.. అందుకే ఈ సినిమాలో పవన్‌ను ఎవరూ ఊహించని విధంగా ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఓజి మూవీలో పవన్‌ను ఏకంగా మూడు వైవిధ్యమైన వేరియేషన్స్‌లో చూపించేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట.

OG Movie: ఓజి మూవీలో జాయిన్ అయిన వెర్సటైల్ యాక్టర్.. ఎవరంటే..?

ఓజి మూవీలో పవన్ ఓ టీనేజర్, ఒక కాలేజీ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇలా మూడు వైవిధ్యమైన లుక్స్‌లో పవన్ కనిపించనుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆమె పాత్ర ఎలా డిజైన్ చేశారా అనే ఆసక్తి నెలకొంది. ఇక అప్పుడెప్పుడో ‘పంజా’ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన పవన్, ఇన్నాళ్ల తరువాత మరోసారి డాన్ లుక్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.