Pawan Kalyan : నా కొడుకు ఫ్రెండ్స్ కాక్రోచ్ జనతా పార్టీలో చేరారు.. పవన్ వ్యాఖ్యలు వైరల్..
ఈ క్రమంలో జెన్ జీ ప్రస్తావన రాగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Pawan Kalyan)
- Saketh U
- Updated on- June 11, 2026 / 08:43 AM IST
Pawan Kalyan
Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి పవన్ ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాకు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రాజకీయాలతో పాటు అనేక అంశాలు మాట్లాడారు. ఈ క్రమంలో జెన్ జీ ప్రస్తావన రాగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Pawan Kalyan : ‘బారాముల్లా’ సినిమాపై పవన్ కళ్యాణ్ రివ్యూ.. ఆ సినిమా నచ్చింది అంటూ..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పుడు అంతా జెన్ జీ అంటున్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒక కొత్త తరం వస్తుంది. వారి ఆకాంక్షలు మారుతాయి. నా కుమారుడికి 20 మంది స్నేహితులు ఉన్నారు. అందులో ఓ ముగ్గురు కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికలో చేరారు. వారికి నచ్చని అంశాలపై మాట్లాడటానికి వాళ్లకు ఒక వేదిక దొరికింది. కాక్రోచ్ జనతా పార్టీలో చేరిన యువత కోపాన్ని అర్ధం చేసుకోగలను. కానీ దశ దిశా లేని కోపం వల్ల ఉపయోగం లేదు.
నేను కూడా యువతతో మాట్లాడుతున్నా. వాళ్ళు ఘర్షణాత్మక రాజకీయాలు మారాలని కోరుకుంటున్నారు. గొడవలు సృష్టించే వాళ్ళు కాదు సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలి అని అడుగుతున్నారని అన్నారు.
