Pawan Kalyan: నా రేంజ్ ఏంటో నాకు తెలుసు.. ‘OG’ లాంటి సినిమాలు చేయగలను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
తన సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
- V Santhosh Kumar
- Updated on- May 25, 2026 / 09:01 PM IST
Pawan Kalyan Interesting Comments on his movies
- పవన్ కళ్యాణ్ ప్రజాసేవకే తొలి ప్రాధాన్యత
- సినిమా రికార్డుల కంటే సమస్యల పరిష్కారం
- రోడ్డు వేయిస్తే ఆస్కార్ వచ్చినంత ఆనందం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్, సినీ ప్రయాణంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గ్లామర్ ప్రపంచం కంటే ప్రజా సేవలోనే తనకు నిజమైన తృప్తి లభిస్తుందని స్పష్టం చేశారు.
Jyothika: ‘సిస్టమ్’ మూవీ మేకింగ్ పిక్స్ షేర్ చేసిన నటి జ్యోతిక.. నెట్టింట ఫోటోలు వైరల్
సినిమాల్లో తనకు ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తన రేంజ్ ఏంటో తనకు బాగా తెలుసని, తలచుకుంటే ఇప్పటికీ ‘OG’ లాంటి భారీ యాక్షన్ సినిమాలు మరెన్నో చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగలనని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అన్నారు. అయితే, వెండితెరపై కేవలం హీరోగా మెరవడం కంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన పేర్కొన్నారు.
అలాగే తనకు సినిమా అవార్డుల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. “సినిమాల్లో నటించి ఆస్కార్ అవార్డు సాధించడం నాకు ముఖ్యం కాదు. 70 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడుతున్న ఒక మారుమూల గ్రామానికి, మేము అధికారంలోకి వచ్చాక రోడ్డు వేయించగలిగితే.. ఆ రోడ్డు ప్రారంభమైన రోజే నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం కలుగుతుంది” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
