Pawan Kalyan : ఆయన చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టాను.. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ వ్యాఖ్యలు..
ఈ వీడియోపై పవన్ స్పందించారు. (Pawan Kalyan)
- Saketh U
- Published On : March 15, 2026 / 09:39 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తో యాంకర్ సుమ సరదాగా చిట్ చాట్ చేసింది.
ఈ సినిమాలో పవన్ దేఖ్ లేంగే సాలా.. అంటూ స్టెప్పులు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓ అభిమాని పవన్ స్టెప్పులు, మైకేల్ జాక్సన్ స్టెప్పులు కలిపి ఓ ఎడిట్ వీడియో చేసారు. ఈ వీడియోని స్టేజి మీద ప్లే చేసారు. దీంతో ఈ వీడియోపై పవన్ స్పందించారు.
Also See : Raashii Khanna : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందాలతో రఫ్ఫాడిస్తున్న రాశీఖన్నా..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను ఎంతోకొంత డ్యాన్స్ వేస్తున్నాను, నా ఒళ్ళు కదులుతుంది అంటే మైకేల్ జాక్సన్ కారణం. ఆయనతో కంపేర్ చేసి ఇలా ఎడిట్ చేయడం తప్పు. నాకు భయం వేస్తుంది. నేను బాగా ఇష్టపడే కళాకారుల్లో ఆయన ఒకరు. ఆయన చనిపోయినప్పుడు ఏడ్చాను. ఆయన మరణించినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. అలాంటి గొప్పాయనతో నేను అభిమానించే మైకేల్ జాక్సన్ గారితో నన్ను కంపేర్ చేయొద్దు, ఇలా ఎడిట్ చేయొద్దు, ఇలా ఎడిట్ చేయడం పాపం అని అన్నారు.
