Pawan Kalyan kicks off the latest schedule of Hari Hara Veera Mallu
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట ప్రకారం ఓ వైపు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూనే మరో వైపు సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నారు. ముందుగా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్ర లాస్ట్ షెడ్యూల్ లో పవన్ పాల్గొంటున్నారు. మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఓ ఫోటోషూట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ షూట్ కోసం భారతీయ తొలి పొటోమెట్రిక్ 3 డీ స్కానింగ్ టెక్నాలజీ వినియోగించారు. రౌండప్‌గా ఉన్న లైట్లు, కెమెరాల మధ్య నిలబడిన హరిహరవీరమల్లు మీసం మెలేస్తున్న విజువల్స్ అదిరిపోయాయి.
ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయిక. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pushpa 2 : పుష్ప ఈవెంట్ లో సుక్కు భార్య కంటతడి.. భర్త సక్సెస్ చూసి..
Power star @PawanKalyan kicks off the latest schedule of #HariHaraVeeraMallu with Power-packed energy!!
In theaters on 28th March 2025!
pic.twitter.com/PliTaUqUgW— Sreenivas Gandla (@SreenivasPRO) December 3, 2024