Pushpa 2 : పుష్ప ఈవెంట్ లో సుక్కు భార్య కంటతడి.. భర్త సక్సెస్ చూసి..

పుష్ప మూవీ టీమ్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు.

Pushpa 2 : పుష్ప ఈవెంట్ లో సుక్కు భార్య కంటతడి.. భర్త సక్సెస్ చూసి..

Sukumar wife Tabitha cried at Pushpa 2 event after seeing her husband success

Updated On : December 3, 2024 / 11:26 AM IST

Pushpa 2 : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా థియేటర్స్ లో రావడానికి రెడీ గా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. తాజాగా నిన్న దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత కూడా వచ్చారు.

Also Read : Pushpa 2 : ‘పుష్ప 2 వైల్డ్ ఫైర్’ మేకింగ్ వీడియో చూసారా.. సుక్కు ఎంత కష్టపడ్డాడో..

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్ప 2 మేకింగ్ వీడియో స్క్రీన్ పై ప్లే చేశారు . పుష్ప కోసం సుక్కు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో, టీమ్ ఈ సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేశారో చూసి ఎమోషనల్ అయ్యింది సుకుమార్ భార్య తబిత. తన భర్త 5 ఏళ్ల పుష్ప జర్నీ చూసి ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె తన భర్త సక్సెస్ చూసి ఆనంద భాష్పాలతో ఎమోషనల్ అయ్యింది. తన భర్తకి ఇంతటి గౌరవం లభించడంతో తన ఆనందాన్ని వ్యక్త పరిచింది. తన పక్కనే ఉన్న సుక్కు, భార్యకు ధైర్యం చెప్తూ ఓదార్చాడు.


దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక తబిత అప్పుడప్పుడు పలు సినిమా ఈవెంట్స్ కి హాజరవుతుంటుంది. అలాగే పుష్ప సినిమాకి సంబందించిన పలు అప్డేట్స్ కూడా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటుంది.