Bheemla Nayak : డప్పు వాయించిన పవన్ కళ్యాణ్ , కేటీఆర్
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి భీమ్లా నాయక్ సాంగ్స్ కి పర్ఫార్మ్ చేస్తూ డ్రమ్స్ వాయించారు. వీరిద్దరూ కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉండగా........
- Saketh U
- Updated on- February 23, 2022 / 09:57 PM IST
Pawan Dappu
Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.
Bheemla Nayak : పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో అదరగొట్టిన హీరోయిన్ సంయుక్త మీనన్
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి భీమ్లా నాయక్ సాంగ్స్ కి పర్ఫార్మ్ చేస్తూ డ్రమ్స్ వాయించారు. వీరిద్దరూ కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉండగా శివమణి వెళ్లి పవన్ కళ్యాణ్ ని, కేటీఆర్ లని స్టేజి మీదకు తీసుకొచ్చి వారితో డ్రమ్స్ వాయించేలా చేశారు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఇద్దరూ కూడా డప్పు వాయించారు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు.
