పవన్ కళ్యాణ్ లుక్ మారింది: క్రిష్ సినిమా కోసమే!

  • Publish Date - February 7, 2020 / 02:51 AM IST

సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా అయిన పవన్ కళ్యాన్… ఇప్పుడు మళ్లీ సినిమా బాట పట్టాడు. అయితే రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ.. అటు పార్టీని పటిష్టపరుచుకుంటూ.. ఇటు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మూడు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఒకటి పింక్ రీమేక్ కాగా.. ఆ సినిమాకి వకీల్ సాబ్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ మొగలాయిల కాలం నాటి పాత్రలో చేస్తున్నారు. ఈ పాత్ర దొంగ పాత్ర కాగా.. అది రాబిన్ హుడ్ లాంటి పాత్ర. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆ నాత్ర కోసం గడ్డం కూడా తీసేశాడు. కాస్త మీసం పెద్దదిగా ఆనాటి లుక్‌లో కనిపించాడు. లేటెస్ట్‌గా కార్యకర్తలతో మీటింగ్‌లో ఇలా కనిపించాడు పవన్ కళ్యాణ్.

రాజకీయాల్లో ఉన్నంతకాలం గుబురు గడ్డం, మీసాలతో కనిపించిన పవన్ కళ్యాణ్..  గడ్డం తీసేసి కొత్తగా కనిపించగానే అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు ఫోటోలను. అయితే లేటెస్ట్ లుక్ మాత్రం క్రిష్ సినిమా కోసమే. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్‌తో మరో సినిమాని చేస్తున్నాడు.