OG 2 Shooting Update : పవన్ కళ్యాణ్ OG 2 అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..
ఇటీవల సుజీత్, పవన్ కళ్యాణ్ కలిసి అధికారికంగా OG 2 ని అనౌన్స్ చేసారు. (OG 2 Shooting Update)
- Saketh U
- Published on- June 29, 2026 / 02:46 PM IST
OG 2 Shooting Update
OG 2 Shooting Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో OG సినిమా పెద్ద హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే స్టైలిష్ గ్యాంగ్ స్టర్ అవతారంలో కనిపించి 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించారు. ఈ సినిమాకు అధికారికంగానే పవన్, దర్శకుడు సుజీత్ పార్ట్ 2 ప్రకటించారు. అది చాలా ఆలస్యం అవుతుందేమో అనుకున్నారు ఫ్యాన్స్.
కానీ ఇటీవల సుజీత్, పవన్ కళ్యాణ్ కలిసి అధికారికంగా OG 2 ని అనౌన్స్ చేసారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. తమన్ OG 2 మ్యూజిక్ వర్క్ కూడా మొదలుపెట్టారు. ఇటీవలే తమన్, పవన్ కళ్యాణ్, సుజీత్ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి OG పార్ట్ 2 సినిమా వర్క్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో హింట్ ఇచ్చారు.
ఇలా వరుస అప్డేట్స్ ఇస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ రాజకీయ బిజీ వల్ల షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో OG 2 సినిమా షూటింగ్ అప్డేట్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రతి ఏటా చేపట్టే నాలుగు నెలల చాతుర్మాస దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష సెప్టెంబర్ లో ముగుస్తుంది.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న OG షూటింగ్ అప్డేట్ ఇచ్చి ఆయన దీక్ష ముగియగానే సెప్టెంబర్ చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఈ కథ జపాన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండటంతో ఈ సారి కచ్చితంగా పవన్ ని జపాన్ కి తీసుకెళ్తారని, పవన్ కూడా విడతల వారీగా 20 రోజులు జపాన్ కి రావడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ సొంతంగా నిర్మిస్తున్నారు.
