OG Universe : పవన్ బర్త్ డే.. ఓజీ 2 అప్డేట్ ఇచ్చిన సుజీత్.. స్పెషల్ వీడియో.. రిలీజ్ ఎప్పుడంటే..?
నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ 2 అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. (OG Universe)
- Saketh U
- Updated on- September 2, 2026 / 09:19 AM IST
OG Universe
OG Universe : ఇప్పటి జెన్ జీ జనరేషన్ కి కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్, స్టామినా చూపించిన సినిమా ఓజీ. పవన్ ఫ్యాన్స్ ఓజీ సినిమాతో ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమాకు ఓజీ యూనివర్స్ కూడా ప్రకటించి ప్రీక్వెల్స్, సీక్వెల్స్ ఉంటాయని అనౌన్ చేసారు. ఈ సినిమాకు ఓజీ 2 కూడా తీస్తామని పవన్ అధికారికంగానే ప్రకటించాడు. ఇటీవల ఓజీ 2 పనులు మొదలుపెట్టినట్టు డైరెక్టర్ సుజీత్, తమన్ ప్రకటించారు.
దీంతో నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ 2 అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. ఫ్యాన్స్ కోసం తాజాగా దర్శకుడు సుజీత్ ఓజీ 2 అప్డేట్ గురించి పోస్ట్ చేసాడు. ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న ట్రీట్ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఇస్తామని ప్రకటించారు. అలాగే పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు సుజీత్.
Also Read : Anna Konidala : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. స్పెషల్ ఫోటో షేర్ చేసి విషెష్ చెప్పిన భార్య అన్నా కొణిదెల..
దీంతో నేడు సాయంత్రం ఓజీ యూనివర్స్ కి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పవన్ ఫ్యాన్స్, ఓజీ ప్రేక్షకులు ఈ స్పెషల్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు.
