Pawan Kalyan – Anna Konidala : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. స్పెషల్ ఫోటో షేర్ చేసి విషెష్ చెప్పిన భార్య అన్నా కొణిదెల..
అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ ఫోటో, పోస్ట్ వైరల్ గా మారింది. (Anna Konidala)
Anna Konidala Shares Special Photo On Pawan Kalyan Birthday
Anna Konidala – Pawan Kalyan: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు, జనసైనికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల కూడా స్పెషల్ ఫోటో షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
పవన్ కళ్యాణ్ తో దిగిన క్యూట్ ఫోటోని అన్నా కొణిదెల తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ రోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తున్నాను. మీరు ఎన్నో హృదయాలలో, ఆలోచనలలో, ప్రార్థనలలో ఉన్నారు. మీరు ఎందరో జీవితాలను ప్రభావితం చేశారనడానికి, ఇతరులకు ఎంతగా ఇచ్చారనడానికి ఇది ఒక అందమైన నిదర్శనం. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసారు. దీంతో అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ ఫోటో, పోస్ట్ వైరల్ గా మారింది.
Also See – Pawan Kalyan Rare Photos : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. రేర్ ఫొటోలు చూశారా..?
View this post on Instagram
