Pawan Kalyan : OG సినిమా అప్డేట్స్ కోసం చూడకండి.. DVV ప్రకటన.. ఎలక్షన్స్ ముందు పవన్ OG సినిమా లేనట్టేనా?
సుజీత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన OG సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
- Saketh U
- Updated on- December 13, 2023 / 09:33 AM IST
Pawan Kalyan OG Movie Shoot in Hold no updates from Movie up to AP Elections
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సినిమాలకు డేట్స్ కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నా సెట్స్ మీద OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు డేట్స్ కేటాయించడంతో ఎన్నికల ముందే సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తారని, కనీసం రెండు సినిమాలు ఎలక్షన్స్ ముందు రిలీజవుతాయని అంతా భావించారు.
కానీ ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో పవన్ షూటింగ్స్ కి మళ్ళీ బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇంకో నాలుగు నెలల్లోనే ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ అస్సలు షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వలేరు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసిన సినిమాలు. ఇవి ఇప్పట్లో అవ్వవని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. వాటి మీద అంచనాలు కూడా ఎవ్వరికి లేవు.
కానీ సుజీత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన OG సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తయింది. స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ పవర్ఫుల్ గా ఉండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ పూర్తి చేసి సినిమా ఎన్నికల ముందే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నారు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ వల్ల డేట్స్ ఇవ్వట్లేదు.
Also Read : Rajinikanth : రజినీకాంత్ విగ్రహానికి పాలాభిషేకం, పూజలు.. రజిని బర్త్ డే స్పెషల్ వీడియో చూశారా..?
తాజాగా OG నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్స్ ఓ ట్వీట్ చేసింది. ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు తెలుసు. కానీ మీకు చెప్పేదేంటి అంటే ప్రస్తుతం షూటింగ్ జరగట్లేదు. కాబట్టి అప్డేట్స్ ఏమి లేవు, రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఎదురు చూడకండి అని ట్వీట్ లో తెలిపింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం కూడా OG షూటింగ్ జరగట్లేదు, అప్డేట్స్ ఏమి లేవు అని చెప్పింది నిర్మాణ సంస్థ. దీంతో ఎన్నికల ముందు OG సినిమా రిలీజ్ కష్టమే అని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. OG సినిమా అయినా థియేటర్స్ లో సందడి చేస్తుంది అనుకుంటే ఈ విషయంలో కూడా పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ని థియేటర్లో చూడాలంటే ఎన్నికల తర్వాతే అని తెలుస్తుంది.
