Rajinikanth : రజినీకాంత్ విగ్రహానికి పాలాభిషేకం, పూజలు.. రజిని బర్త్ డే స్పెషల్ వీడియో చూశారా..?

కొంతమంది అభిమానులు మాత్రం రజినీకాంత్ కోసం కట్టిన గుళ్లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి స్పెషల్ పూజలు నిర్వహించారు.

Rajinikanth : రజినీకాంత్ విగ్రహానికి పాలాభిషేకం, పూజలు.. రజిని బర్త్ డే స్పెషల్ వీడియో చూశారా..?

Rajinikanth Fans offered prayers in his temple at Madurai on his Birthday

Updated On : December 13, 2023 / 9:10 AM IST

Rajinikanth Birthday : నిన్న డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) పుట్టిన రోజు. ఒక బస్ కండెక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నారు రజినీకాంత్. 73 ఏళ్ళ వయసులో కూడా రజినీకాంత్ సినిమాలు తీస్తూ అభిమానులని మెప్పిస్తున్నారు. నిన్న ఆయన పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక రజినీకాంత్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగే. రజిని ఇంటి వద్దకు నిన్న వేలాది మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి తరలి వచ్చారు. పలువురు అభిమానులు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం రజినీకాంత్ కోసం కట్టిన గుళ్లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి స్పెషల్ పూజలు నిర్వహించారు.

Also Read : Daggubati Family : దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. ఫ్యామిలీ ఫోటో చూశారా.. రానా, చైతూ, వెంకీమామ..

తమిళనాడులోని మధురైలో కొన్నాళ్ల క్రితం రజినీకాంత్ కి అభిమానులు గుడి కట్టారు. అందులో రజినీకాంత్ విగ్రహం పెట్టి దానికి పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న రజిని పుట్టిన రోజు కావడంతో ఆ గుళ్లో రజినీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.