Daggubati Family : దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. ఫ్యామిలీ ఫోటో చూశారా.. రానా, చైతూ, వెంకీమామ..

అభిరామ్ పెళ్లి నుంచి గతంలో ఒక్క ఫోటో తప్ప ఇంకేమి బయటకి రాలేదు. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ లో కనపడిన విజువల్స్ వైరల్ అయ్యాయి. తాజాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి నుంచి ఫ్యామిలీ ఫోటో ఒకటి బయటకి వచ్చింది.

Daggubati Family : దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. ఫ్యామిలీ ఫోటో చూశారా.. రానా, చైతూ, వెంకీమామ..

Daggubati Family Photo goes Viral from Abhiram Marriage

Updated On : December 13, 2023 / 12:48 PM IST

Daggubati Family : ఇటీవల దగ్గుబాటి వారింట పెళ్లి బాజా మోగిన సంగతి తెలిసిందే. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్(Abhiram) ఓ ఇంటివాడయ్యాడు. వారి దగ్గరి బంధువైన ప్రత్యూషని శ్రీలంకలో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహాన్ని చాలా సైలెంట్ గా నిర్వహించారు.

అభిరామ్ పెళ్లి నుంచి గతంలో ఒక్క ఫోటో తప్ప ఇంకేమి బయటకి రాలేదు. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ లో కనపడిన విజువల్స్ వైరల్ అయ్యాయి. తాజాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి నుంచి ఫ్యామిలీ ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫొటోలో సురేష్ బాబు, ఆయన భార్య, వెంకటేష్, ఆయన భార్య, వెంకటేష్ పిల్లలు, భార్యతో రానా, నాగచైతన్య, మరికొంతమంది కుటుంబ సభ్యులు.. ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఉంది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Daggubati Family Photo goes Viral from Abhiram Marriage

Also Read : Samantha : క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన సమంత.. హాలిడేస్ అంటూ..

ఇటీవలే ఈ ఫ్యామిలీ అంతా పెళ్లి వేడుక అయ్యాక హైదరాబాద్ కి తిరిగి రాగా కొత్త జంట ఎయిర్ పోర్ట్ లో కనపడి సందడి చేశారు. ఇక దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పరాజయం పాలైంది. కొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేసే అవకాశం ఉంది. అయితే పెళ్లిని ఇంత సైలెంట్ గా ఎందుకు చేశారు అనేది తెలియదు. అలాగే హైదరాబాద్ లో సినీ ప్రముఖుల కోసం స్పెషల్ గా రిసెప్షన్ అరేంజ్ చేస్తారని వార్తలు వచ్చినా అది కూడా ఉండదు అనే తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Celebrity Couple (@celebritycouple.love)