Samantha : క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన సమంత.. హాలిడేస్ అంటూ..

తాజాగా సమంత క్రిస్మస్(Christmas) సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్ గా మారాయి

Samantha : క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన సమంత.. హాలిడేస్ అంటూ..

Samantha Shares Christmas Decoration Photos at her Home

Updated On : December 13, 2023 / 12:15 PM IST

Samantha : సమంత కొన్నాళ్ల పాటు సినిమాలకుగ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం మీద ఫోకస్ చేయడానికి సినిమాలకు గ్యాప్ ఇచ్చాను అని చెప్పి వివిధ దేశాలు తిరిగేస్తూ ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ మరో పక్క ఆహ్లాదకర ప్రదేశాలను ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల భూటాన్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది.

ఇటీవల తను నడిపిస్తున్న ఏకమ్ స్కూల్స్ కి వెళ్లి పిల్లలతో సరదాగా గడిపింది. ఆ తర్వాత తన ప్రత్యూష ఫౌండేషన్ లో ఉన్న అనాథ పిల్లలతో కలిసి హాయ్ నాన్న సినిమా చూసి వైరల్ గా మారింది సమంత. తాజాగా సమంత క్రిస్మస్(Christmas) సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్ గా మారాయి. తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్న ఫోటోని, తను డెకరేట్ చేసిన క్రిస్మస్ ట్రీ వీడియోని, తన ఇంట్లో క్రిస్మస్ కి అరేంజ్ చేస్తున్న డెకరేషన్స్ ని ఫొటోలు, వీడియోల రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది సమంత.

Image

Also Read : Pawan Kalyan : OG సినిమా అప్డేట్స్ కోసం చూడకండి.. DVV ప్రకటన.. ఎలక్షన్స్ ముందు పవన్ OG సినిమా లేనట్టేనా?

ఇక తను షేర్ చేసిన ఓ వీడియోకి హ్యాపీ హాలిడేస్ అని పోస్ట్ చేసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపింది సామ్. దీంతో సమంత పోస్టు చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరలో సమంత మరిన్ని క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్ చేస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.