Pawan Kalyan OG : OG మూడో షెడ్యూల్ స్టార్ట్.. పవన్ షెడ్యూల్ గురించి అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైనట్లు నిర్మాతలు తెలియజేశారు. ఇక పవన్..
- gum 95921
- Published on- June 4, 2023 / 03:26 PM IST
Pawan Kalyan OG Movie Third Schedule starts and pawan will join in few days
Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), OG, Bro, హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షెడ్యూల్స్ లో ఒక దాని తరువాత ఒక దానిలో పాల్గొంటూ వస్తున్న పవన్.. షూటింగ్స్ మొత్తం పూర్తి చేసేస్తాడు అనుకున్నారు అభిమానులంతా. కానీ ఇటీవల వారాహి షెడ్యూల్ ని రిలీజ్ చేస్తూ జూన్ రెండో వారం నుంచి రాజకీయం పై వెళ్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులంతా సినిమాల విషయం ఏంటని కంగారు పడ్డారు.
తాజాగా పవన్ నటిస్తున్న OG మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైనట్లు నిర్మాతలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ లో కొన్ని రోజులు పాల్గొనబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాని సాహూ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తుంటే.. RRR నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఉస్తాద్ విషయానికి వస్తే.. ఈ మూవీ ఇప్పటికి ఒక షెడ్యూల్ ని మాత్రమే పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు మొదలు కాబోతుంది అనే దాని పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.
Chiranjeevi : తాను క్యాన్సర్ బారిన పడ్డాననే ప్రచారంపై చిరంజీవి క్లారిటీ
ఇక హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. షూటింగ్ మొదలు పెట్టుకొని దాదాపు 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా 50 శాతం షూటింగ్ పెండింగ్ ఉంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. పవన్ నుంచి ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా అంటే అది BRO మూవీ మాత్రమే. సాయి ధరమ్ తో చేసిన ఈ ఫాంటసీ మూవీ రీమేక్ చిత్రంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
