Pawan Kalyan : పైరసీ పై ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్.. అమిత్ షాతో మీటింగ్.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
నేడు జరిగిన ఓ సినిమా ఈవెంట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని దీని గురించి మాట్లాడారు. (Pawan Kalyan)
- Saketh U
- Updated on- May 27, 2026 / 05:08 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : సినీ పరిశ్రకు ఉన్న అనేక కష్టాల్లో పైరసీ ఒకటి. ఈ పైరసీ మీద ఎప్పటికప్పుడు సినీ నిర్మాతలు, ప్రముఖులు యుద్ధం చేస్తున్నా పైరసీ తగ్గట్లేదు. ప్రభుత్వాలు, పోలీసులు కూడా ఈ పైరసీ మీద ఫోకస్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పైరసీ మీద ఫోకస్ చేస్తున్నారని సమాచారం.
నేడు జరిగిన ఓ సినిమా ఈవెంట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని దీని గురించి మాట్లాడారు. ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. రీసెంట్ గా డిఫ్యూటీ సీఎం కల్యాణ్ గారిని పెద్ద ప్రొడ్యూసర్స్ వెళ్లి కలిశారు. పెద్ద ప్రొడ్యూసర్స్ కు సమస్యలు ఉన్నట్లే మా చిన్న నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు మేమూ వెళ్లి పవన్ కల్యాణ్ గారిని కలిసి వివరిస్తాం.
పైరసీ సమస్య ఆల్రెడీ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఆయనే మమ్మల్ని పిలిచి అది ఎలా అంతం చేయాలి అని ఒక ప్రణాళిక తీసుకొని రమ్మన్నారు. దాని మీద వర్క్ చేస్తున్నాం. సుప్రియ గారు లీడ్ చేస్తున్నారు. పైరసీ అరికట్టేందుకు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కేంద్రమంత్రి అమిత్ షా గారిని త్వరలో కలవబోతున్నాం అని తెలిపారు.
దీంతో పవన్ సైలెంట్ గా పైరసీని అంతం చేసే దానిపై వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. గతంలో కూడా పవన్ ఆయన సినిమాలు పైరసీ అయినప్పుడు, మహేష్ బాబు సినిమా పైరసీ అయినప్పుడు, వేరే సినిమాల విషయంలో కూడా బయటకు వచ్చి మాట్లాడి సపోర్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు పవన్ పైరసీని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.
