Pawan Kalyan Ranveer Singh : ఇది ఫస్ట్ టైం కాదు.. రణవీర్ వర్సెస్ పవన్.. గతంలో రెండు సినిమాలకు ఇలాగే ఫైట్..

రణవీర్ సింగ్ దురంధర్ హిందీ సినిమా. కానీ ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. (Pawan Kalyan Ranveer Singh)

  • Published On : March 18, 2026 / 02:59 PM IST

Pawan Kalyan Ranveer Singh

Pawan Kalyan Ranveer Singh : ఉగాది నాడు మార్చ్ 19న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కానుంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ – పవన్ కాంబోలో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇదే రోజు రణవీర్ సింగ్ దురంధర్ 2 కూడా రిలీజ్ కానుంది. దురంధర్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

రణవీర్ సింగ్ దురంధర్ హిందీ సినిమా. కానీ ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక మన ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు వరకే. దీంతో ఉగాదికి తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ రణవీర్ సింగ్ అన్నట్టు తయారయింది. దురంధర్ కేవలం సిటీస్, మల్టిప్లెక్స్ ల వరకే. కానీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ రేంజ్ అందరికి తెలిసిందే. ఉస్తాద్ ప్రతి ఊళ్ళో, ప్రతి థియేటర్ లో రిలీజ్ అవుతుంది.

Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ రివ్యూ.. తొలిప్రేమ సాంగ్ రీమిక్స్.. ఇండస్ట్రీ జనాలు ఏమంటున్నారు..?

అయితే ఇలా పవన్ – రణవీర్ ఇప్పుడే కాదు గతంలో కూడా రెండు సార్లు ఒకేసారి తమ సినిమాలను రిలీజ్ చేసారు. 2011లో డిసెంబర్ 9న పవన్ కళ్యాణ్ పంజా సినిమా రిలీజ్ అయింది. పవన్ కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ ఫిలిం పంజా. అదే రోజు రణవీర్ సింగ్ లేడీస్ వర్సెస్ రికీ బహల్ రిలీజ్ అయింది. అప్పట్లో హిందీ సినిమాకు ఇక్కడ అంత ఆదరణ లేదు. కేవలం హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అయింది.

ఆ తర్వాత 2023 జులై 28న పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ అయింది. అదే రోజు రణవీర్ సింగ్ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహానీ సినిమా కూడా రిలీజ్ అయింది. ఇలా ఇప్పటికే రెండు సార్లు పవన్, రణవీర్ సింగ్ తమ సినిమాలని ఒకే రోజు రిలీజ్ చేసారు. ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ – దురంధర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Harish Shankar : ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి వచ్చి తనకు ప్రపోజ్ చేస్తే.. హరీష్ శంకర్ ఏం చెప్పాడో తెలుసా?