Bro Collections : ‘బ్రో’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? హిట్ టాక్ తో అదరగొట్టిన మామా అల్లుళ్ళు..
పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదరగొట్టేసారు బ్రో సినిమాకు. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పవన్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది.
- Saketh U
- Updated on- July 29, 2023 / 01:47 PM IST
Pawan Kalyan Sai Dharam Tej Bro Movie First day Collections
Bro Movie Collections : పవన్ కళ్యాణ్ (Pawan kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా నిన్న జులై 28న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం (Vinodhaya Sitham) సినిమాకు బ్రో రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో తెరకెక్కింది. మొదటి ఆట నుంచే బ్రో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది.
ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. దీంతో థియేటర్స్ లో ప్రతి పది నిమిషాలకి గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ అరుపులు, విజిల్స్ తో అదరగొట్టారు. ఇక సినిమా చివరి 15 నిముషాలు ప్రేక్షకులని ఏడిపించేశారు. దీంతో సినిమా అటు పవన్ అభిమానులకి, ఇటు ఫ్యామిలీలకు కూడా విపరీతంగా కనెక్ట్ అయింది.
పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదరగొట్టేసారు బ్రో సినిమాకు. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పవన్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది. బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే 35.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది బ్రో సినిమా. ఓవర్సీస్ లో 9 కోట్లకు పైగా, కర్ణాటకలో 3 కోట్లకు పైగా, రెస్టాఫ్ ఇండియా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Akira Nandan : OG సినిమాతో అకిరా ఎంట్రీ ఫిక్స్..? అకిరా ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్..
ఇవాళ, రేపు వీకెండ్ కావడం, సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం, ఫ్యాన్స్ కోసం వింటేజ్ పవన్ సాంగ్స్ పెట్టడంతో మూడు రోజుల్లో బ్రో సినిమా కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక థియేటర్స్ లో బ్రో హంగామా రెండో రోజు కూడా సాగుతుంది.
