×
Ad

Bro Movie OTT Update : ‘బ్రో’ సినిమా ఓటీటీ రిలీజ్ అప్పుడే.. థియేటర్ షో ముగిసినట్టే..?

బ్రో సినిమా థియేటర్ బిజినెస్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. ఇక అభిమానులతో పాటు థియేటర్లో ఈ సినిమాని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

  • Published On : August 13, 2023 / 11:07 AM IST

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie OTT Releasing date

Bro Movie OTT Update :  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ మూవీ జులై 28న రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ్ లో వచ్చిన వినోదయ సితం సినిమాకు రీమేక్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బ్రో సినిమాలో కేతిక శర్మ, ప్రియా వారియర్, తనికెళ్ళ భరణి, అలీ రాజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రోహిణి ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రో సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా సినిమా బాగుంది అని అన్నా గ్రాస్ పరంగా ఇప్పటికి 130 కోట్ల వరకు కలెక్షన్స్ అంటే 65 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సాధించింది.

అయితే బ్రో సినిమా దాదాపు 80 కోట్లకు థియేటరికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఇంకా సినిమాకు రావాల్సిన షేర్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే థియేటర్స్ లో జైలర్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలు వచ్చేయడంతో చాలా చోట్ల బ్రో సినిమాని పక్కన పెట్టేశారు. దీంతో బ్రో సినిమా థియేటర్ బిజినెస్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. ఇక అభిమానులతో పాటు థియేటర్లో ఈ సినిమాని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Jailer Collections : మూడు రోజుల్లో 200 కోట్లు పైనే.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న తలైవార్

తాజాగా బ్రో సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. బ్రో సినిమా ఆగస్టు 25 లేదా 26న జీ5 ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా బ్రో సినిమా వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం నాడు ఆగస్టు 25న జీ5 ఓటీటీలోకి వస్తుందని చిత్రయూనిట్ అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా బ్రో సినిమా వస్తుందని సమాచారం.