×
Ad

Bro Movie : అదరగోట్టిన ‘బ్రో’ కలెక్షన్స్.. రెండు రోజుల్లో 75 కోట్లు దాటేసిందిగా.. థియేటర్స్‌లో పవన్ సునామీ..

పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాకి మరింత హైప్ వచ్చి మరిన్ని కలెక్షన్స్ పెరిగాయి. రెండో రోజు కూడా ఇదే జోరు కంటిన్యూ చేసింది బ్రో సినిమా.

  • Published On : July 30, 2023 / 12:22 PM IST

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Second Day Collections

Bro Movie Collections : ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్ (Sai Dharam Tej) క‌లిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన వినోద‌య సితం (Vinodhaya Sitham) సినిమాకు బ్రో రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని (Samuthirakani) ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కింది. ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. థియేటర్స్ లో ఫ్యాన్స్ అరుపులు, విజిల్స్ తో అదరగొట్టారు. సినిమా చివరి 15 నిముషాలు ప్రేక్షకులని ఏడిపించేశారు. దీంతో సినిమా అటు పవన్ అభిమానులకి, ఇటు ఫ్యామిలీలకు కూడా విపరీతంగా కనెక్ట్ అయింది.

ఇక పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాకి మరింత హైప్ వచ్చి మరిన్ని కలెక్షన్స్ పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే బ్రో కలెక్షన్స్ అదరగొట్టేశాయి. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. పవన్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే 35.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది బ్రో సినిమా మొదటి రోజు.

Posani Krishna Murali : తమిళ్ వాళ్ళని పొగుడుతూనే.. తమిళ ఇండస్ట్రీ నిర్ణయాలపై.. రోజా భర్తపై పోసాని కామెంట్స్..

ఇక రెండో రోజు కూడా ఇదే జోరు కంటిన్యూ చేసింది బ్రో సినిమా. రెండో రోజు బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మొత్తం రెండు రోజుల్లో 75 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. పవన్ కెరీర్ లో రెండు రోజుల్లోనే ఇన్ని కలెక్షన్స్ ఇదే మొదటి సారి. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎలాగో ఆదివారం కావడంతో ఇవాళ కూడా ఫుల్ కలెక్షన్స్ వచ్చి మూడు రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలుస్తుంది అని అంచనా వేస్తున్నారు అభిమానులు.