Bro : మామా అల్లుళ్ళ డబుల్ బొనాంజా ట్రీట్.. కొత్త పోస్టర్ రిలీజ్!
బ్రో సినిమా నుంచి పవన్ అండ్ సాయి ధరమ్ కాంబినేషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తామంటూ టైం ఫిక్స్ చేసిన మేకర్స్.. తాజాగా ఆ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
- gum 95921
- Published On : May 29, 2023 / 10:11 AM IST
Pawan Kalyan Sai Dharam tej combination poster from Bro movie released
Pawan Kalyan Bro : మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam tej) కలయికలో వస్తున్న మూవీ Bro. తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఇక ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పవన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత సాయి ధరమ్ లుక్ ని కూడా రివీల్ చేసి ట్రీట్ ఇచ్చారు. ఈసారి డబుల్ బొనాంజా ట్రీట్ ఇస్తామంటూ ప్రకటించిన మేకర్స్.. ఇద్దరు కాంబినేషన్ లో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేస్తామంటూ టైం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
Hanuman : టీజర్ రెస్పాన్స్ తరువాత హనుమాన్ కథ మారింది.. దర్శకుడు ప్రశాంత్ వర్మ!
కాగా ఈ సినిమాని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలో వినోదయ సిత్తంని కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశాడు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రియా వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ పవన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిపోయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పై ఒక సాంగ్ బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జులై 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
Pawan Kalyan Sai Dharam tej combination poster from Bro movie released
