Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇక ఆ సినిమా ఇప్పట్లో లేనట్టే
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కొత్త సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : February 22, 2026 / 10:20 AM IST
Pawan Kalyan-Surender Reddy movie temporarily halted
Pawan Kalyan: ఓజీ సినిమాతో తన ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). కొన్నేళ్లుగా తన ఫ్యాన్స్ తాను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్. సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా రీజనల్ సినిమాగా రిలీజై ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఆ జోష్ లోనే ఇప్పడు ఉస్తాద్ భగత్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే, ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటాడు అని అనుకున్నారు అంతా.
Ruhani Sharma: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ రుహాణి శర్మ.. ఫొటోలు వైరల్
కానీ, ఆయన అనూహ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. దీనికి, సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుంది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, ప్రెజెంట్ సిచువేషన్ చూసుకుంటే ఈ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి సినిమాకు ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ కథను అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, కథ పవన్ కి నచినప్పటికీ రీసెంట్ గా ఇచ్చిన ఫైనల్ న్యారేషన్ మాత్రం అంత ఇంప్రెసివ్ గా లేదని ఫీలయ్యాడట పవన్. అందుకే, మరికొంత సమయం తీసుకున్న పరవాలేదు బెస్ట్ స్క్రిప్ట్ తో రావాలని సూచించాడట. దీంతో, ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ న్యూస్ తెలిసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.
