Aditi Govitrikar : ‘తమ్ముడు’ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
తమ్ముడు సినిమాలో లవ్లీ పాత్రలో అదితి గోవిత్రికర్ మెప్పించింది.
- Saketh U
- Published On : July 15, 2024 / 10:16 AM IST
Pawan Kalyan Thammudu Movie Heroine Aditi Govitrikar Recent Photos goes Viral
Aditi Govitrikar : పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల్లో తమ్ముడు ఒకటి. 1999లో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజయి నేటికి 25 సంవత్సరాలు కావడం విశేషం. ఈ సినిమాలో ప్రీతీ జింగ్యానీ హీరోయిన్ గా నటించగా సెకండ్ హీరోయిన్ గా అదితి గోవిత్రికర్ నటించింది. తమ్ముడు సినిమాలో లవ్లీ పాత్రలో అదితి గోవిత్రికర్ మెప్పించింది.
ముంబైకి చెందిన ఈ భామ తమ్ముడు సినిమా తర్వాత ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. మళ్ళీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా అడపాదడపా వెబ్ సిరీస్, టీవీ షోలలో కనిపిస్తుంది అదితి. అయితే అదితి గోవిత్రికర్ స్వతహాగా డాక్టర్. MBBS తర్వాత మోడలింగ్ కి వెళ్లడంతో సినిమా అవకాశాలు వచ్చి సినిమాల్లోకి వచ్చింది. కరోనా తర్వాత ఫుల్ టైం డాక్టర్, సైకాలజిస్ట్ గా మారిపోయింది. ప్రస్తుతం పలు బ్యూటీ పేజెంట్, మోడల్ షోలలో కూడా పాల్గొంటూ బిజీగానే ఉంది అదితి.
అదితి గోవిత్రికర్ గతంలో మిసెస్ వరల్డ్ కూడా గెలిచింది. ఇప్పుడు తమ్ముడు రిలీజయి 25 ఏళ్ళు అవుతుండటంతో మరోసారి అదితి గోవిత్రికర్ వైరల్ అవుతుంది. అయితే అప్పటికి ఇప్పటికి అదితి చాలా మారిపోయింది. అప్పుడు హీరోయిన్ గా, మోడల్ గా ఎంతో అందంగా, క్యూట్ గా ఉన్న అదితి ఇప్పుడు ఏజ్ పెరగడంతో ఆ ఛాయలు ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా మంది హీరోయిన్స్ ఏజ్ పెరుగుతున్నా కూడా అందాన్ని మెయింటైన్ చేస్తారు. మరి అదితి ఈ ఫీల్డ్ లో ఉండను అనుకోని ఎక్కువ మెయింటైన్ చేయలేదేమో అందుకే ఇంతలా మారిపోయింది అని అంటున్నారు. ప్రస్తుతం అదితి గోవిత్రికర్ భర్తకి విడాకులు ఇచ్చాక తన పిల్లలతో కలిసి ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది అదితి.
