Pawan Kalyan – Trivikram : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే ముందుగా త్రివిక్రమ్‌ని సంప్రదించాలి. త్రివిక్రమ్ ఓకే చేస్తేనే పవన్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. టాలీవుడ్లో ఎప్పటినుంచో ఉంది ఈ టాక్. పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యాక ఆయనకి వచ్చే సినిమాలన్నీ త్రివిక్రమ్ ముందే కథలు వింటున్నాడు, కొన్ని ప్రాజెక్ట్స్ త్రివిక్రమ్ సొంతంగా పవన్ కి సెట్ చేస్తున్నాడు. పవన్, త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి అందరికి తెలుసు. రీసెంట్గా ఈ ఇద్దరి కాంబినేషన్లో బ్రో సినిమా విడుదలైంది.
అయితే సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులైన ఈ ఇద్దరి మధ్య సంక్రాంతి పోటీ జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ గుంటూరు కారం(Guntur Kaaram).. పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagat Singh) సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయనే సమాచారం టెంపరేచర్‌ను పెంచేస్తుంది. ఈ ఇద్దరు మిత్రుల మధ్య జరిగే పోటీలో ఎవరు హిట్ కొడతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. అంతే బిజీబిజీగా సినిమాలు చేస్తున్నారు. గత నెలలో పవన్ నటించిన బ్రో(Bro) సినిమా రిలీజ్ అవ్వగా ఇంకా OG, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు షూటింగ్‌లు జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఖాళీ లేకుండా తిరుగుతున్న పవన్ బ్రో షూటింగ్ పూర్తి చేశాక సినిమాలకు గ్యాప్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను కొన్నాళ్లు వాయిదా వేస్తారని ఏపీ ఎన్నికలు అయ్యాకే షూటింగ్ మొదలుపెడతారని టాలీవుడ్ టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ఈ సినిమాను సంక్రాంతి(Sankranthi)కి రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పడం ఇంట్రస్టింగ్‌గా మారింది.
పవన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అంటే అభిమానులకు నిజంగా పండగే. కానీ ఇక్కడే మరో ఇంట్రస్టింగ్ పాయింట్ కూడా ఉంది. సంక్రాంతికే మహేశ్‌బాబు నటించనున్న గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. గుంటూరు కారం సినిమా జనవరి 13 రిలీజ్ చేస్తామని ఆల్రెడీ డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు పవన్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. ఈ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకే సీజన్లో ఇద్దరూ సినిమా రిలీజ్ చేస్తారా? ఎవరో ఒకరు తగ్గుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా నష్టం జరగొచ్చని టాలీవుడ్ వర్గాల అభిప్రాయం.
గుంటూరు కారం సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎప్పుడో అనుకోగా ఇప్పుడు పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ తెరపైకి రావడంతో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇద్దరు మిత్రుల మధ్య సంక్రాంతి పోటీ జరగడంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ కొందరు ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే వెనక్కి తగ్గేది ఎవరు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఎలాగైనా సంక్రాంతికి ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ చేయాలనే ఆలోచనతో కాల్షీట్లు ఇచ్చారు. 30
రోజుల్లోనే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Tamannaah : సుశాంత్ ఫస్ట్ సినిమాలో హీరోయిన్.. ఇప్పుడేమో సుశాంత్‌కి సిస్టర్ గా..
అయితే ఈ రెండు సినిమాలు కూడా ఇంకా షూటింగ్ మొదటి దశలోనే ఉన్నాయి. ఇంకో అయిదు నెలల్లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఒక స్టార్ హీరో సినిమాకి అవ్వాలి అంటే కొంచెం కష్టమే. మరి దర్శకులు త్రివిక్రమ్, హరీష్ ఎవరు ఫాస్ట్ గా పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలుస్తారో లేదా సంక్రాంతి నుంచి ఎవరు తప్పుకుంటారో చూడాలి. పవన్, త్రివిక్రమ్ మధ్య పోటీ ఉంటుందా? లేదా ఎవరో ఒకరే వస్తారా అంటే వెయిట్ చేయాల్సిందే.