Ustaad bhagat singh : ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్‌.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌..

పవ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (Ustaad bhagat sing) చిత్ర ట్రైల‌ర్ వ‌చ్చేసింది.

Pawan Kalyan Ustaad bhagat singh trailer out now

Ustaad bhagat singh : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రాశీ ఖ‌న్నా, శ్రీలీల క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉగాది కానుక‌గా మార్చి 19న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

‘వాడు నీకు భ‌య‌ప‌డ‌లేదా? అస‌లు ఎవ‌డికి భ‌య‌ప‌డ‌లేదా ?’ అనే వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ‘వైలెన్స్‌ అంటే మీనింగ్ తెలియ‌ని మీ అంద‌రికి ఓ ఫ్యాష‌న్ అయిపోయింది.. చూపిస్తా’ అంటూ ప‌వ‌న్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. మొత్తంగా ట్రైల‌ర్ అదిరిపోయింది. ప‌వ‌న్ చెప్పిన డైలాగ్‌లు, ఫైట్లు ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తున్నాయి

Puri Jagannadh daughter : పూరిజగన్నాథ్ కూతురు ఎంతగా మారిపోయిందో చూశారా?

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ను మార్చి 15 (ఆదివారం) సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.