×
Ad

Mahesh – Pawan : అప్పుడు పవన్ కోసం మహేష్.. ఇప్పుడు మహేష్ కోసం పవన్.. నిజమేనా..?

అప్పుడు పవన్ కోసం మహేష్ వస్తే, ఇప్పుడు మహేష్ కోసం పవన్ రాబోతున్నాడట.

  • Published On : September 7, 2023 / 12:47 PM IST

Pawan Kalyan voice over for Mahesh Babu Guntur Kaaram

Mahesh Babu – Pawan Kalyan : టాలీవుడ్ బిగ్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక వీరిద్దరిని ఒకే వేదిక పైన లేదా ఒకే స్క్రీన్ పైన చూడాలనేది చాలామంది ఆడియన్స్ కోరిక. కానీ అది జరగడం చాలా కష్టం అనుకోండి. అయితే అభిమానులను కోరికను ఒక విధంగా తీరుస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు ఈ ఇద్దరు స్టార్స్. గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Pushpa 2 : పుష్ప 2 సెట్స్ నుంచి వీడియో లీక్.. బాబోయ్ ఎన్ని లారీలు..

పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి త్రివిక్రమ్ మాటలతో మహేష్ నడిచిన జల్సా కథ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పవన్ వంతు వచ్చి వచ్చింది. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతి బరిలో ఈ మూవీ నిలవబోతుంది అంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీకి పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అనే వార్త ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.

Bigg Boss 7 Day 3 : ఒక హీరోయిన్‌ని ముద్దు అడిగితే.. మరో హీరోయిన్ పెట్టింది.. మూడోరోజు హైలైట్స్..

అప్పుడు పవన్ జల్సా కోసం మహేష్ ని తీసుకు వచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు మహేష్ గుంటూరు కారం కోసం పవన్ ని తీసుకు రాబోతున్నాడట. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉన్నదో తెలియదు. మరి పవన్ నిజంగానే ఈ మూవీ కోసం తన పవర్ ఫుల్ వాయిస్ ని ఇవ్వబోతున్నాడా..? అనేది తెలియాలి అంటే.. రిలీజ్ లేదా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.