Pawan Kalyan: “వీరమల్లు”ను ముగించే పనిలో పవన్.. ఖుషీలో ఉన్న ఫాన్స్!
రాజకీయాల్లో నిమగ్నమైన పవన్ కళ్యాణ్.. తన తదుపరి సినిమా షూటింగ్ లపై ఎటువంటి నిర్దారణకు రాకపోవడంతో అభిమానులందరిని కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై బడ్జెట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. "హరి హర వీర మల్లు" సగభాగం షూటింగ్ జరుపుకున్నప్పటికీ, మరో సగభాగం పెండింగ్‌లో పడింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే..
- gum 95921
- Published On : September 20, 2022 / 05:33 PM IST
Pawan Kalyan Want to Finish The Hari Hara Veera Mallu Shooting
Pawan Kalyan: రాజకీయాల్లో నిమగ్నమైన పవన్ కళ్యాణ్.. తన తదుపరి సినిమా షూటింగ్ లపై ఎటువంటి నిర్దారణకు రాకపోవడంతో అభిమానులందరిని కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది. రాజకీయ ప్రవేశం తరువాత “వకీల్ సాబ్” సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పవన్, ఈ సంవత్సరం ప్రారంభంలో “భీమ్లా నాయక్” రూపంలో అభిమానులను పలకరించాడు.
Pawan Kalyan: ఉన్న సినిమాలకే డేట్స్ ఇవ్వని పవన్.. సాహో డైరెక్టర్ తో సినిమా నిజమేనా?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై బడ్జెట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. “హరి హర వీర మల్లు” సగభాగం షూటింగ్ జరుపుకున్నప్పటికీ, మరో సగభాగం పెండింగ్‌లో పడింది. ఇక ఈ సినిమా ఆగిపోయింది అంటూ కూడా వార్తలు వస్తుండడంతో, ఇటీవల పవన్ పుట్టినరోజున ఆ వార్తలన్నిటిని కొట్టిపడేస్తూ ఒక “పవర్ గ్లాన్స్” విడుదల చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది మూవీ టీం.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. అక్టోబర్ నుంచి హరి హర వీర మల్లు సినిమా షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించాలని పవన్ నిర్ణయించుకున్నాడట. నవంబర్ నెలాఖరులోగా మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, డిసెంబర్‌లో “వినోదయ సీతమ్” రీమేక్ కోసం పవన్ కేవలం 25 రోజుల కాల్షీట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ యొక్క భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్స్ యొక్క భవితవ్యం ఏంటన్నది మాత్రం తెలియదు.
