Pawan Kalyan: ఉన్న సినిమాలకే డేట్స్ ఇవ్వని పవన్.. సాహో డైరెక్టర్ తో సినిమా నిజమేనా?

సాహో డైరెక్టర్ సుజిత్.. తన బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, స్టైలిష్ మేకింగ్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే RRR ప్రొడ్యూసర్ డివివి దానయ్య, డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ రాయిస్తున్నట్టు, అందులో పవన్...

Pawan Kalyan: ఉన్న సినిమాలకే డేట్స్ ఇవ్వని పవన్.. సాహో డైరెక్టర్ తో సినిమా నిజమేనా?

Pawan Kalyan in Saaho Movie Direction

Updated On : September 8, 2022 / 1:53 PM IST

Pawan Kalyan: సాహో డైరెక్టర్ సుజిత్.. తన బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, స్టైలిష్ మేకింగ్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సుజిత్ తరువాత యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ లో శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన “రన్ రాజా రన్” మంచి విజయం అందుకోవడంతో ఏకంగా తన రెండో సినిమా ప్రభాస్ తో చేసే అవకాశం అందుకుని సాహో మూవీ తీశాడు.

Pawan Kalyan : ఎన్టీఆర్ లాగే పవన్ కూడా ఎలక్షన్స్ ముందు సినిమాలు చేయాలి.. పవన్ పై పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

బాహుబలి మూవీ తరువాత వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ డైరెక్టర్ ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించలేదు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కోసం సుజీత్ కొన్ని నెలలుగా స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడని, వరుణ్ తేజ్ కథానాయకుడుగా ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఎటువంటి అధికార ప్రకటన లేదు.

ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే RRR ప్రొడ్యూసర్ డివివి దానయ్య, డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ రాయిస్తున్నట్టు, అందులో పవన్ డాన్ రోల్ లో నటించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో నిజం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.