Pawan Kalyan : ఎన్టీఆర్ లాగే పవన్ కూడా ఎలక్షన్స్ ముందు సినిమాలు చేయాలి.. పవన్ పై పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..
పరుచూరి పలుకులు అనే పేరుతో గోపాలకృష్ణ యూట్యూబ్ లో ఓ ఛానల్ నిర్వహిస్తూ సినిమాలపై విశేషణాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ............

Paruchuri Gopala Krishna Comments on Pawan Kalyan
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ లో ఆయనకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇటీవలే ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఇక పవన్ సినిమాలు ఒప్పుకున్నా రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల సినిమాలకి డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. అభిమానులు మాత్రం పవన్ సినిమాలు రెగ్యులర్ గా చేయాలని కోరుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
పరుచూరి పలుకులు అనే పేరుతో గోపాలకృష్ణ యూట్యూబ్ లో ఓ ఛానల్ నిర్వహిస్తూ సినిమాలపై విశేషణాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ”పవన కళ్యాణ్ ఇటీవలే పుట్టిన రోజు చేసుకున్నారు. ఆయనకి నా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరాలి. పవన్ ఇప్పటివరకు దాదాపు 27 సినిమాలు చేశాడు. ఒకప్పుడు ఫుల్ సక్సెస్ లో వెళ్లి ఆ తర్వాత కొన్ని డిఫరెంట్ సబ్జెక్టులతో నిరాశపరిచిన ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త సినిమాలతో ముందుకి వస్తున్నారు.”
”గతంలో చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ వాళ్లంతా ఏదో ఒకసారి పదవిలోకి వచ్చి వెళదాం, ఏదో ఒక పార్టీలో సీటు తెచ్చుకుందాం అనుకునేవాళ్లే. కానీ పవన్ జనాలకి ఏదో చేయాలనే ఆశయంతో వచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా కూడా అదే ఆశయంతో వచ్చారు. అన్న గారిలాగే పవన్ ఆలోచన కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలి, మన మాటలు సభల ద్వారా ప్రజలకి తెలియచేయాలి. జనాల కోసం పని చేయాలి అని అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా పవన్ ముందుకి వెళ్తారు.”
Captain Movie : ఆర్య ‘కెప్టెన్’ కథ ఇదేనా..? హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్..
”ఒక్కోసారి సామజిక సమీకరణాల వల్ల రాజకీయాలు మారిపోతాయి. పవన్ కళ్యాణ్ వాయిస్ చట్టసభల ద్వారా వినపడాలి అని నేను కోరుకుంటున్నాను. పవన్ కి అన్ని విషయాలు మన అందరి కంటే ఎక్కువ తెలుసు. పవన్ యోగా చేస్తారు. ఆయన చిరునవ్వు, ఆయన ఆవేశం వెనుకాల అనేక కారణాలు ఉంటాయి. ఆయన సమాజాన్ని మార్చడానికి అందరూ కలిసి రావాలని కోరుకుంటారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేముందు చేసిన సినిమాలు ఆయనకి సీఎం అవ్వడానికి ఉపయోగపడ్డాయి. అందుకే పవన్ కూడా తన రాజకీయాలకి పనికొచ్చే సినిమాలు చేయాలి. ఎలక్షన్స్ల ముందు సినిమాలు చేసి పవన్ ప్రజల్లోకి మరింతగా వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ ఈ సారి గెలిచి చట్టసభల్లోకి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి” అని తెలిపారు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి పవన్ ఈ బిజీ రాజకీయాల షెడ్యూల్స్ మధ్యలో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తారా లేదా చూడాలి.