Pawan Kalyan : వైద్యపరీక్షల కోసం భార్యతో కలిసి ముంబైకి పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ముంబైకి చేరుకున్నారు. (Pawan Kalyan)

  • Updated on- June 29, 2026 / 05:25 PM IST

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొంత కోలుకున్న ఇంకా భుజాల కండరాలకు సంబంధించిన ఆపరేషన్ చేయాలని ఆయనే స్వయంగా ఓ ప్రెస్ మీట్ లో తెలిపారు. నేడు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించిన పరీక్షల కోసం ముంబై వెళ్లారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ముంబైకి చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు.

Also Read : NTR Trivikram : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అనౌన్స్.. గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ వచ్చేసింది..

పరీక్షల అనంతరం రిపోర్ట్స్ చూసుకొని ఆపరేషన్ గురించి మాట్లాడి మళ్ళీ మంగళగిరికి తిరుగుప్రయాణం అవుతారని సమాచారం. త్వరలోనే దానికి సంబంధించిన ఆపరేషన్ కూడా చేయించుకుంటారని తెలుస్తుంది. దీంతో పవన్ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.