Sekhar Kammula : విద్యార్థి ఉద్యమాలపై శేఖర్ కమ్ముల మూవీ ప్లాన్ ?
సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న సినిమాలను తీసే శేఖర్ కమ్ముల (Sekhar Kammula) జంతర్ మంతర్ దగ్గర సీజేపీ చేసిన ఆందోళనలపై రియాక్ట్ అయిన తీరు ఇంట్రెస్టింగ్గా మారింది.
Sekhar Kammula New Movie On Students Protest
Sekhar Kammula : శేఖర్ కమ్ముల.. టాలీవుడ్ దర్శకుల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ ఏంటో చెప్పక్కర్లేదు కూడా. యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు సాటిలేరు. మామూలుగానే సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న సినిమాలను తీసే శేఖర్ కమ్ముల.. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ చేసిన ఆందోళనలపై రియాక్ట్ అయిన తీరు ఇంట్రెస్టింగ్గా మారింది.
విద్యార్థుల నిరసనకు సపోర్ట్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఇంతలోపే టాలీవుడ్లో వైరల్ టాక్ ఒకటి మొదలైంది. సీజేపీ ఆందోళలను బేస్ చేసుకొని శేఖర్ కమ్ముల ఓ మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.
Anasuya Bharadwaj : కుటుంబంతో కలిసి కొండలు ఎక్కిన అనసూయ.. బాధపడటం లేదంటూ ఫోటోలు..
గతంలో ఆయన తీసిన లీడర్ సినిమా మంచి రాజకీయ నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ తరహాలో సీజేపీ అనే కథను తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్టు టాక్. ఈ సినిమాలో విద్యార్థి ఉద్యమాలు, రాజకీయ వ్యూహాలు, సామాజిక మార్పులు వంటి అంశాలను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం ఉంటుందని అంటున్నారు.
ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో లేదో కానీ..విద్యార్థి ఉద్యమాలకు..పాలిటిక్స్‌కు లింక్ పెడుతూ శేఖర్ కమ్ముల మేకింగ్ స్టైల్లో మూవీ వస్తే మాత్రం..ఆడియన్స్ ఆకట్టుకోవడం పక్కా అన్న చర్చ జరుగుతోంది.
