Pawan Kalyan : కనుమ స్పెషల్.. గోవుల్ని పూజించి ఆహరం అందించిన పవన్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కనుమ పండుగ సందర్భంగా ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆవుల్ని సందర్శించి అక్కడి ఆవులకి పూజలు చేసి, వాటికి ఆహరం అందించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆవులకి.................
- Saketh U
- Published On : January 17, 2023 / 02:38 PM IST
Pawan Kalyan worshiped cows on Kanuma
Pawan Kalyan : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగని ఘనంగా జరుపుకున్నారు. పట్నం ప్రజలు ఊళ్ళకి వెళ్లి ఫ్యామిలీలతో ఎంజాయ్ చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పండగని ఘనంగా జరుపుకున్నారు. తమ ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నాడు కనుమ పండుగ కావడంతో అందరూ సాంప్రదాయం ప్రకారం పశువులకు పూజలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కనుమ పండుగ సందర్భంగా ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆవుల్ని సందర్శించి అక్కడి ఆవులకి పూజలు చేసి, వాటికి ఆహరం అందించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆవులకి ఆత్మీయంగా ఆవులకి ఆహరం అందిస్తున్న ఫోటోలని జనసేన పార్టీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. కనుమ అంటే పశుపక్ష్యాదులను గౌరవించే పండుగ రైతుకు వ్యవసాయంలో సాయంచేసే పశువులను ఆరాధించే వేడుక. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేడు సంప్రదాబద్దంగా వ్యవసాయ క్షేత్రంలో కనుమ వేడుక జరిపారు. గోపూజ నిర్వహించారు. ఆవులకు స్వయంగా అరటిపళ్ళు నోటికి అందించారు. గోష్ఠంలోని అన్ని గోవులకు మేత వేశారు అని తెలిపింది. దీంతో పవన్ ఆవులకి ఆహరం తినిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pawan Kalyan : ఆవులతో ఆత్మీయంగా పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కి పశువులు, వ్యవసాయం, మొక్కలు అంటే ఇష్టం. పవన్ సొంతంగా వ్యవసాయం కూడా చేస్తారని తెలిసిందే. గతంలో కూడా పవన్ వ్యవసాయ పనులు చేస్తూ, ఆవులకు, గేదెలకు ఆహరం అందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కనుమ అంటే పశుపక్ష్యాదులను గౌరవించే పండుగ రైతుకు వ్యవసాయంలో సాయంచేసే పశువులను ఆరాధించే వేడుక అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నేడు సంప్రదాబద్దంగా వ్యవసాయ క్షేత్రంలో కనుమ వేడుక జరిపారు.గోపూజ నిర్వహించారు ఆవులకు స్వయంగా అరటిపళ్ళు నోటికి అందించారు గోష్ఠంలోని అన్ని గోవులకు మేత వేశారు pic.twitter.com/TzMZ78Wgne
— JanaSena Party (@JanaSenaParty) January 16, 2023
