Peddi Buchi Babu Sana: పెద్ది లో ఆ సీన్స్ కట్ చేస్తామన్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు..

Buchi Babu Sana: పెద్ది (Peddi) చిత్రంలో కొన్ని స‌న్నివేశాల్లో మార్పులు చేయ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు తెలిపారు.

Peddi Director Buchi Babu Sana Apologize Over Janhvi Kapoor Scenes

Buchi Babu Sana: ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన పెద్ది చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే.. ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీ క‌పూర్ పాత్ర‌ను చూపించిన విధానంతో పాటు కొన్ని స‌న్నివేశాల‌పై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు వీటికి వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో పాటు క్ష‌మాప‌ణ‌లు సైతం కోరారు. మ‌హిళ‌లు అంటే త‌న‌కు ఎప్పుడూ అపార‌మైన గౌర‌వం ఉంద‌ని అన్నారు. ఈ చిత్రంలో కొన్ని స‌న్నివేశాల్లో మార్పులు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టును పంచుకున్నారు.

ఒక చిత్ర ద‌ర్శ‌కుడిగా.. సినిమాతో ప్రేక్షకులను అలరించాలి, ప్రేరేపించాలి, వారితో మమేకం కావాలని నేను అనుకుంటాను. ఈ క్ర‌మంలో ఎవరినీ అసౌకర్యానికి గురిచేయకూడదు లేదా అగౌరవపరచకూడదని అనుకుంటాను. ‘పెద్ది’లోని కొన్ని సన్నివేశాల పై విమ‌ర్శ‌లు మా దృష్టికి వ‌చ్చాయి. వాటిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళల పట్ల నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది. ఏ స్త్రీ పాత్రను వస్తువుగా చూపించడం లేదా అగౌరవపరచడం మా ఉద్దేశ్యం ఎప్పుడూ కాదు. వ్యక్తం అవుతున్న ఆందోళనలను అర్థం చేసుకుంటాము. మీ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాము.

*Janhvi Kapoor : అచ్చియమ్మ హర్ట్ అయ్యిందా.?

అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత సంబంధిత భాగాలలో మార్పులు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రేక్షకులు ఆద‌రిస్తేనే సినిమా ఎదుగుతుంది. కథకులుగా.. మారుతున్న దృక్కోణాలు, సున్నితత్వాల పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్రతి మహిళ గౌరవించబడటానికి అర్హురాలే. వారిని శ‌క్తిమంతంగా చూపించ‌డానికి, వారి విలువ‌ను పెంచే క‌థ‌లు చెప్ప‌డానికి మేం క‌ట్టుబ‌డి ఉన్నాము. ఇక పెద్ది విష‌యంలో తమ అభిప్రాయాలను నిజాయితీగా, మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అని ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సాన తెలిపాడు.