Janhvi Kapoor: జాన్వీ కపూర్ క్రేజీ లైనప్.. అమ్మడు అందానికి తెలుగు స్టార్స్ ఫిదా.. అల్లు అర్జున్ తో కొత్త సినిమా
టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ సుందరి జాన్వీ కపూర్(Janhvi Kapoor).
- V Santhosh Kumar
- Updated on- May 19, 2026 / 04:05 PM IST
Peddi movie heroine Janhvi Kapoor doing a film with icon star Allu Arjun.
- దేవర సినిమాతో గ్రాండ్ ఎంట్రీ
- జూన్ 4న పెద్ది విడుదల
- టాప్ హీరోల సినిమాలతో క్రేజీ లైనప్
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేసుకుంటోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి గ్రాండ్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, మొదటి చిత్రంతోనే ఇక్కడి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కమర్షియల్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఈమె టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
Naga Chaitanya: ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు పడుతున్నాయ్.. మళ్ళీ ఆ డైరెక్టర్ తో అవసరమా?
‘దేవర’ ఇచ్చిన భారీ సక్సెస్ ఊపుతో, జాన్వీ కపూర్ తన తదుపరి చిత్రాలను మరింత క్రేజీగా లైన్‌లో పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అక్కడితోనే ఆగకుండా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Janhvi Kapoor), స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’లో కూడా జాన్వీ కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.
వరుసగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్ హీరోల సినిమాలను దక్కించుకుంటూ జాన్వీ కపూర్ సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ హిస్టరీలోనే ఇంత తక్కువ సమయంలో ముగ్గురు టాప్ స్టార్స్ సరసన ఛాన్సులు కొట్టేసిన హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. ఈ రేంజ్ స్పీడ్ అండ్ ప్లానింగ్‌తో దూసుకుపోతున్న జాన్వీ, టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ రేస్‌లో మిగతా వారికంటే చాలా ముందంజలో నిలిచింది. మరి రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.
