Peddi Collections : అక్కడ అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు.. పెద్ది కలెక్షన్స్ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
ఇప్పటికే పెద్ది సినిమా 378 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. (Peddi Collections)
- Saketh U
- Published on- June 14, 2026 / 04:52 PM IST
Peddi Collections
Peddi Collections : రామ్ చరణ్ పెద్ది సినిమా ఇటీవల జూన్ 4న రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకొని పొగుడుతున్నారు. ఇప్పటికే పెద్ది సినిమా 378 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ వీకెండ్ తో 400 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది.
ఇప్పటికే ఆంధ్రలో బ్రేక్ ఈవెన్ అయింది. నైజాంలో కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చింది. తమిళ్ లో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే ఈ సినిమాలో కుస్తీ కాన్సెప్ట్ ఉండటంతో నార్త్ జనాలకు కనెక్ట్ అవుతుంది అనుకున్నారు కానీ పెద్ది నార్త్ లో అంతగా పెర్ఫార్మ్ చెయ్యట్లేదు. ఈ సినిమాకు ఇప్పటివరకు నార్త్ లో కేవలం 30 కోట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. అలాగే ఓవర్సీస్ లో కూడా 3.2 మిలియన్ డాలర్స్ దాటినా ఇంకా ఎక్కువ వస్తాయని ఆశించారు.
Also Read : Ananth Sriram : జాన్వీ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు.. అనంత శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్..
నేడు పెద్ది సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మూవీ యూనిట్ సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలో కలెక్షన్స్ గురించి ప్రశ్నించగా నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ఓవర్సీస్ లో మేము అనుకున్నంత అయితే రాలేదు. దాని మీద కొంత స్టడీ చేయాలి. ఇప్పటి నుంచి పెరగొచ్చు. నార్త్ లో ఒక్కో సినిమా పట్టుకుంటారు. ఒక్కో సినిమా పట్టుకోకపోవచ్చు. పెద్ది సినిమా పట్టుకోవాలి. మరి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు తెలియదు. ఈ వారం కూడా చూడాలి అని అన్నారు. దీంతో నిర్మాత ఇలా ధైర్యంగా కలెక్షన్స్ రాని ఏరియాల గురించి మాట్లాడటం చర్చగా మారింది.
