అజిత్ న్యూ లుక్.. ‘పింక్’ తమిళ రీమేక్

  • Publish Date - March 27, 2019 / 10:07 AM IST

తమిళనాట చిన్న స్థాయి హీరోగా మొదులపెట్టి.. చాలా పెద్ద రేంజికి ఎదిగిన నటుడు అజిత్ కుమార్. రజనీకాంత్ లాగే అజిత్‌ది కూడా తమిళనాడు కాదు. వేరే ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డాడు. మారుతున్న ట్రెండుకు తగ్గట్లుగా మిగతా హీరోలు కొంచెం క్లాస్ టచ్ ఉన్న పాత్రలు చేస్తున్నారు కానీ.. అజిత్ మాత్రం మారట్లేదు. అవే మాస్ క్యారెక్టర్లతో కంటిన్యూ అయిపోతున్నాడు.

అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పింక్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్‌ చేయాలనేది శ్రీదేవి చివరి కోరిక అని బోనీ కపూర్‌ అప్పట్లో చెప్పుకొచ్చాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నర్కొండ పరావై పేరుతో ఉంది. అయితే ఈ రీమేక్‌లో అజిత్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. 

అయితే మొత్తానికి అజిత్‌ పింక్‌ రీమేక్‌లో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంతేకాకుండా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ రీమేక్ లో కన్నడ స్టార్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాద్ నటిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మిస్తోన్న ఈ మూవిని హెచ్‌. వినోద్‌ తెరకెక్కిస్తున్నాడు.