Pochamma: ఆహాలో మిస్టికల్ థ్రిల్లర్ ‘పోచమ్మ’.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
పోచమ్మ(Pochamma) మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన చేసిన ఆహా.
- V Santhosh Kumar
- Published On : April 13, 2026 / 05:49 PM IST
Pochamma movie streaming on Aha OTT from april 17th
- ఆసక్తికరంగా ‘పోచమ్మ’ మూవీ ట్రైలర్
- డివోషనల్ ఎలిమెంట్స్ తో థ్రిల్లర్ జానర్ లో
- ఏప్రిల్ 17 నుంచి ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్
Pochamma: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ప్రేక్షకులను అలరించేందుకు మరో సరికొత్త మిస్టికల్ థ్రిల్లర్ ‘పోచమ్మ’తో సిద్ధమైంది. అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్‌పై శ్రుతి నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. ఈ నెల 17వ తేదీ నుండి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుండగా, గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందే దీనిని వీక్షించే అవకాశం ఉంది.
NBK 111: బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మూవీ కోసం మ్యాజికల్ కాంబో.. మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ
ఈ సిరీస్ కథా నేపథ్యం చుట్టూ అడవులు ఉన్న ఒక అందమైన ప్రాంతంలో సాగుతుంది. అక్కడ ఉన్న ఒక పాత ఇంటి ముందు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లిని పూజిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆ ప్రాంతాన్ని కాపాడుతుందని అందరి నమ్మకం. అయితే, స్వార్థం కోసం ఆ తల్లి గుడిని, విగ్రహాన్ని తొలగించాలని చూసే వ్యక్తులకు పోచమ్మ(Pochamma) తల్లి ఎలాంటి గుణపాఠం నేర్పింది, తనను ఎదిరించిన వారిని ఎలా శిక్షించింది అనే అంశాలను ట్రైలర్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు. భక్తికి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు తోడుగా ఇందులో ఒక యువ జంట ప్రేమకథ కూడా ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ముగింపులో పోచమ్మ తల్లి మళ్ళీ ఆ ప్రాంతానికి తిరిగి రావడం వంటి దృశ్యాలు సిరీస్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. దైవత్వానికి, మనుషుల దురాశకు మధ్య జరిగే పోరాటంగా ఈ సిరీస్ రూపొందినట్లు తెలుస్తోంది. అద్భుతమైన విజువల్స్, వెన్నులో వణుకు పుట్టించే సంగీతంతో ‘పోచమ్మ’ ట్రైలర్ ఆద్యంతం సాగింది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ మిస్టికల్ జర్నీ డిజిటల్ తెరపై ఆవిష్కృతం కానుంది.
